ఫీల్డింగ్‌ సెటప్‌ నచ్చలేదని..

Did not like the fielding setup..– మైదానం వీడిన విండీస్‌ బౌలర్‌ జొసెఫ్‌
బ్రిడ్జ్‌టౌన్‌: ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌ మూడో వన్డేలో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. కెప్టెన్‌ ఫీల్డింగ్‌ మొహరింపులు నచ్చలేదని అసహనంతో బౌలర్‌ మైదానం వీడాడు. గల్లీ క్రికెట్‌లో తరహా దృశ్యాలు బ్రిడ్జ్‌టౌన్‌లో కనిపించాయి. ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌లో నాల్గో ఓవర్లో అల్జారీ జొసెఫ్‌ బౌలింగ్‌ చేశాడు. నాల్గో బంతికి జొర్డాన్‌ వికెట్‌ పడగొట్టాడు. కానీ తాను సూచించిన మేరకు కాకుండా కెప్టెన్‌ షారు హోప్‌ భిన్నమైన ఫీల్డింగ్‌ మొహరింపులు చేశాడు. దీనిపై జొసెఫ్‌ ఓవర్‌ అసాంతం అసహనంతో కనిపించాడు. ఓవర్‌ అనంతరం సమాచారం లేకుండా డ్రెస్సింగ్‌రూమ్‌కు వెళ్లిపోయాడు. దీంతో ఐదో ఓవర్లో వెస్టిండీస్‌ పది మంది ఆటగాళ్లతోనే ఫీల్డింగ్‌ చేసింది. కోచ్‌ డారెన్‌ సామీ చొరవతో మైదానంలోకి వచ్చిన జొసెఫ్‌ 10 ఓవర్లలో 2 వికెట్లకు 45 పరుగులు ఇచ్చాడు. జొసెఫ్‌ ప్రవర్తనపై కోచ్‌ సామీ మండిపడ్డాడు. ఈ ప్రవర్తన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ప్రెస్‌మీట్‌లో వ్యాఖ్యానించాడు. తొలుత ఇంగ్లాండ్‌ 263/8 పరుగులు చేయగా.. వెస్టిండీస్‌ మరో 42 బంతులు ఉండగానే 267/2తో లక్ష్యాన్ని ఛేదించి 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. 2-1తో వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుంది.