– శ్రీలంక క్రికెట్ బోర్డు వివరణ
కొలంబో: ఇటీవల అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన ఐసీసీ 2024 టీ20 ప్రపంచకప్‌లో న్యూయార్క్‌లోని జట్టు హౌటల్ ముందు శ్రీలంక క్రికెటర్లు ‘మందుపార్టీ’ చేసుకున్నారని వస్తున్న వార్తలపై ఆ దేశ క్రికెట్ బోర్డు వివరణ ఇచ్చింది. ‘జూన్ 3న న్యూయార్క్ వేదికగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు మందుపార్టీ చేసుకున్నారని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. ఆటగాళ్లు మందు తాగారని చెప్పడానికి ఒక్క ఆధారమూ లేదు. ఆటగాళ్లను, శ్రీలంక క్రికెట్‌ను అప్రతిష్టపాలు చేయాలనే ఉద్దేశంతో సదరు వార్త ప్రచురణ సంస్థ ఈ వార్తను ప్రచురించింది. ఆ సంస్థ తమ తప్పును సరిదిద్దుకుంటే మంచిది’ అని ఓ ప్రకటనలో తెలిపింది.