గన్ని సంచుల లెక్కల్లో తేడా.?

The difference in the calculations of mine bags.?– పిఏసిఎస్ నిర్వాహకుల తీరు
– రూ.40 లక్షల సొసైటీ కమిషన్ నిలిపివివేత
– ఆందోళనలో సొసైటీ రైతులు 
నవతెలంగాణ – మల్హర్ రావు
ఎప్పుడు వివాదంలో మొదటిస్తానంలో ఉండే తాడిచెర్ల ప్రాథమిక వ్యవసాయ  సహకార సంఘం సొసైటీ మరో వివాదానికి తెర లేపింది.2022లో కొనుగోలు కేంద్రాల ద్వారా  సొసైటీ రావాల్సిన కమిషన్ సొమ్ము నిర్వాహకుల గన్ని సంచులు లెక్కల్లో చేసిన తప్పిదాలతో ప్రభుత్వం పెండింగ్ లో పెట్టినట్లుగా తెలుస్తోంది.ప్రభుత్వం నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు అవసరమైన గన్నీ బ్యాగులను ప్రభుత్వమే పౌర సర ఫరాల శాఖ నుంచి సరఫరా చేస్తుంది. అయితే మండలంలో 11 పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు అవసరమైన గన్నీ బ్యాగులను తాడిచర్ల సొసైటీ నుంచి పంపిణీ జరుగుతుంది. కానీ ధాన్యం కొనుగోళ్లు ముగిసిన తర్వాత మిగిలిన గన్నీ బ్యాగులను తిరిగి సొసైటీకి అప్పగించాల్సిన నిర్వాహకులే నిర్లక్ష్యంగా ఎక్కడి గని సంచులు అక్కడే వదిలేయడం వారి వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. సొసైటీకి భారీ లోటు వల్ల నష్టం జరిగి నట్లు మంగళవారం నిర్వహించిన ఎంసీ మీటింగ్లో బహిర్గతమైంది. 2016నుంచి 2023వరకు 7ఏళ్లుగా నిర్వహించిన ధాన్యం కొనుగోళ్ల సీజన్లో సొసైటీకి గన్నీ సంచుల లోటుకు రూ.40లక్షలు బాకీ తేలినట్లు తెలిసింది. అదేవిధంగా 2022 ఖరీఫ్ సీజన్ నుంచి సొసైటీకి రావాల్సిన కమిషన్ ను ప్రభుత్వం పెండింగ్లో పెట్టేసింది.
గన్నీ సంచుల లోటు భర్తీ చేయడానికి సొసైటీకి రావాల్సిన కమిషన్ నుంచే కోత విధించి నట్లు జిల్లా అధికారుల నుంచి తాడిచర్ల సొసైటీ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ధాన్యం కొనుగోలు ఒక్క సంవత్సరానికి రెండు సీజన్లకు సొసైటీకి వచ్చే కమిషన్ లాభం దాదాపుగా రూ.30లక్షలు. ఇలా 2సంవత్సరా లుగా కమిషన్ చెల్లింపును ప్రభుత్వం పెండింగ్ లిస్టులో ఉంచింది. అయితే పీఏసీఎస్లో తరచుగా ఏదో ఒకటి రైతుల సొమ్ము స్వాహ లేదా సొసైటీకీ లోటు బడ్జెట్ చూపిస్తూ డైరెక్టర్లు, కార్యాలయ సిబ్బంది కుమ్మక్కవడంతో సొసైటీలో అంతర్గ తంగా అక్రమాలు జరుగుతున్నాయనే విమర్శలు గుప్పుమంటున్నాయి. సింగిల్ విండో సొసైటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పంపిణీ చేస్తున్న విలువైన గన్నీ బ్యాగులు దుర్వినియోగం కాకుండా ధాన్యం కొనుగోలు ముగియగానే మిగిలిన గన్నీ బ్యాగులను తిరిగి అప్పగించాల్సి ఉండగా ఆ లెక్కలు అడిగే వారు లేరు. ప్రభుత్వ సొమ్ముతో మాకేంటి అనే కోణంతో అధిక ఖర్చుల లెక్కలు రాసుకుని నిర్వా హకులు స్వాహకు పాల్పడే ప్రయత్నం చేయగా ఎంసీ మీటింగ్తో అది బెడిసి కొట్టింది. కానీ మిస్ అయిన గన్నీ సంచుల లెక్కల్లో తేడాతో సొసైటీ నిర్వాహకుల నిర్లక్ష్యానికి ప్రభుత్వానికి చెల్లించే కమిషన్ సొమ్ము రూ.40లక్షల భారీ మూల్యంతో సొసైటీ అభివృద్ధికి అడ్డంకిగా మారింది. ఈ అక్ర మాలకు కారకులైన వారిని విధుల నుంచి తొలగించి సొసైటీ అభివృద్ధికి, రైతులకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.