భిన్న కంటెంట్‌ సినిమా

భిన్న కంటెంట్‌ సినిమాదేవ్‌, ప్రియ చౌహాన్‌, సరిత ప్రధాన పాత్రలలో ‘ప్రేమ పిపాసి’ ఫేమ్‌ మురళి రామస్వామి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘దీనమ్మ జీవితం’. వై.మురళి కష్ణ, వై.వెంకటలక్ష్మీ, డి.దివ్య సంతోషి, బి సోనియా నిర్మించారు. జనవరి 5న ఈ చిత్రం థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్‌ ప్రీ రిలీజ్‌ ట్రైలర్‌ని లాంచ్‌ చేసింది. దర్శకుడు మురళి రామస్వామి మాట్లాడుతూ,’సందీప్‌ రెడ్డి వంగా ‘యానిమల్‌’ చిత్రం లాంటి రా ఫ్యామిలీ సినిమా ‘దీనమ్మ జీవితం’. చాలా డిఫరెంట్‌ కంటెంట్‌తో వస్తున్న చిత్రమిది. మలయాళం, తమిళ పరిశ్రమలే కాదు తెలుగులోనూ కంటెంట్‌తో సినిమా చెప్పగలరని నిరూపించే చిత్రం’ అని తెలిపారు. ‘ఈ సినిమా మా అందరికీ మంచి విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. చాలా మంచి కంటెంట్‌తో వస్తున్న చిత్రమిది. ఖచ్చితంగా పెద్ద విజయాన్ని అందుకుంటుదనే నమ్మకం ఉంది’ అని దేవ్‌ చెప్పారు. సమాజంలో జరిగే కథ అని నాయిక ప్రియ చౌహాన్‌ అన్నారు.