సాయి రోనక్, అమృత చౌదరి హీరో హీరోయిన్లుగా క్రాస్ వైర్ క్రియేషన్స్ పై కళ్యాణ్ చక్రవర్తి నిర్మాతగా, దర్శకుడిగా వస్తున్న సినిమా ‘రివైండ్’. ఈనెల 18న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం శనివారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా హీరోయిన్ అమృత చౌదరి మాట్లాడుతూ, ‘బిగ్ స్క్రీన్ మీద నాకు ఇది ఫస్ట్ సినిమా. నాకే కాదు మా డైరెక్టర్, ఎడిటర్, సినిమాటోగ్రాఫర్ అందరికీ కూడా. కథ చాలా భిన్నంగా, ఫ్రెష్ స్క్రీన్ ప్లేతో సినిమా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకు లందరికీ నచ్చుతుంది అని ఆశిస్తున్నాను’ అని తెలిపారు. ‘ఒక మంచి కంటెంట్ ఉన్న లైన్‌తో ఈ సినిమా చేశాం. తెలుగు ప్రేక్షకులు మంచి కంటెంట్ ఉంటే కచ్చితంగా సినిమాను ఆదరిస్తారు. ఆనమ్మకంతోనే ఈ సినిమా చేశాం. ప్రేక్షకులు అందరూ సినిమా చూసి సక్సెస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’ అని హీరో సాయి రోనక్ అన్నారు. నిర్మాత, డైరెక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ, ‘టైం ట్రావెల్ మీద తీసిన లవ్, సై ఫై జోనర్ మూవీ. టైమ్ ట్రావెల్ మీద వచ్చిన సినిమాలు ఎప్పుడూ సక్సెస్ అవుతాయి. ఈ మూవీ స్క్రీన్ ప్లే చాలా బాగా వచ్చింది. మా ఈ టైం ట్రావెల్ మీద తీసిన రివైండ్ మూవీ కూడా ప్రేక్షకులు అందరినీ కచ్చితంగా మెప్పిస్తుందనే నమ్మకంతో ఉన్నాం’ అని చెప్పారు.