
– ఘటన స్థలానికి ఎస్సై శ్రీకాంత్
నవతెలంగాణ – చందుర్తి
గత కొంత కాలంగా రైతుల మధ్య తొవ్వ పంచాయతీ నడుస్తోంది. పలు మార్లు అధికారుల దృష్టికి తీసుకెల్లినప్పటికీ కూడా పరిష్కారం కాకపోవడంతో కొందరు రైతులు అట్టి తొవ్వకు అడ్డంగా కంచె వేసి టెంట్ వేశారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేట గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. ఘటన స్థలానికి స్థానిక ఎస్సై శ్రీకాంత్ వెళ్లి విచారిస్తున్నట్లుగా సమాచారం.