– ‘సుస్ధిత వ్యవసాయం కోసం సాంకేతిక’ జాతీయ సదస్సులో డాక్టర్ హిమాన్షు పాఠక్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
భవిష్యత్తులో డిజిటల్ వ్యవసాయం చేయాలని ఐసీఏఆర్ సెక్రటరీ డాక్టర్ హిమాన్షు పాఠక్ సూచించారు. హరిత విప్లవానికి పూర్వం, ఆ తర్వాత పరిశోధనలు అందుబాటులోకి వచ్చాయన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో శాస్త్రవేత్తలు, ఆహార ఉత్పత్తికి సంబంధించిన ప్రతి అంశంలో విస్తరించి ఉన్నారని తెలిపారు. దీనిని స్మార్ట్ వ్యవసాయం లేదా కచ్చితమైన వ్యవసాయం అని పిలుస్తారని గుర్తు చేశారు. గురువారం హైదరాబాద్‌లోని క్రిడా ప్రాంగణంలో ‘సుస్థిర వ్యవసాయం, పర్యావరణం కోసం సాంకేతిక’ అనే జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. వ్యవసాయ ఉత్పాదకతను నిలకడగా ఉచేందుకు జీఐఎస్, రిమోట్ సెన్సింగ్, జీపీఎస్, ఉపగ్రహాల వంటి స్పేస్ అప్లికేషన్ టెక్నాలజీలను సాగుతో అనుసంంధానం చేయాలని సూచించారు. వ్యవసాయంలో డ్రోన్ల వంటి స్మార్ట్ టెక్నాలజీ అప్లికేషన్‌ల కోసం ఐసీఏఆర్‌్, కేంద్ర ప్రభుత్వం వంటి సంస్థలు నిధులు అందిస్తున్నాయని తెలిపారు. ఐఎస్‌ఏపీ ఫెలో అవార్డులు, డాక్టర్ శిబెందు శంకర్‌రే అందుకున్నారు.