ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ తరగతులు

నవతెలంగాణ – భిక్కనూర్
ప్రయివేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ తరగతులను ప్రారంభిస్తుందని భిక్నూర్‌ పట్టణ సర్పంచ్ తునికి వేణు అన్నారు. మంగళవారం మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల తరగతి గదిలో ఏర్పాటుచేసిన ఐఎఫ్ పి ప్యానెల్ డిజిటల్ టీవీ సర్పంచ్ ప్రారంభించారు. విద్యా దినోత్సవం సందర్భంగా పాఠశాల ఆవరణలో జాతీయ జెండాను ఎగురవేసి విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖన, నృత్య, పాటల పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేసి, రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, ఏకరూప దుస్తులు అందజేశారు. పదవ తరగతి పరీక్షలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బోడ నరేష్, ఎంపీటీసీలు సువర్ణ ప్రభాకర్, చంద్రకళ రాములు, ఎస్ఎంసి వైస్ చైర్మన్ కుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాజమౌళి, ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, ఉదయ్ దత్, హనుమంత్ రెడ్డి, యాదగిరి, పి ఆర్ టి యు జిల్లా అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.