ప్రభుత్వ పాఠశాల లో డిజిటల్ వెలుగులు

– స్మార్టు బోర్డుల పై విద్యా బోధన
– డిజిటల్ విద్యతో మెరుగుపడుతున్న విద్యాప్రమాణాలు
– ఆనందం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు
నవతెలంగాణ – పెద్దవూర
చాలామంది విద్యార్థులకు చదువంటే ఇష్టమే. కానీ అప్పుడప్పుడు కొద్దిమంది స్కూల్‌కు డుమ్మా కొడుతుంటారు. కారణం ఏమిటని తోటి విద్యార్థులు అడిగితే టీచర్లు చెప్పే పాఠాలు బోర్ కొడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. ఇలాంటివాటిని అధిగమించేందుకు బ్లాక్ బోర్డు చదువులకు భిన్నంగా డిజిటల్ పాఠాలు రన్ అవుతున్నాయి. ఈ పాఠాలు బోర్ కొట్టవు. వినడానికి సులువుగా ఉంటుంది. స్పష్టంగా ఉంటుంది. పాఠం ఎప్పటికీ గుర్తుంటుంది. వీడియో క్లిప్పింగ్‌ల రూపంలో బోధన ఉండటంతో ఇంకొంచెం సేపు క్లాసు కొనసాగితే బాగుండుననే భావన విద్యార్థుల్లో ఉంటుంది. డిజిటల్ క్లాస్‌లో ఉంటే సినిమా హాల్లో ఉన్నట్టుగా ఉంటుందంటున్నారు విద్యార్థులు. 45 నిమిషాలపాటు ఉపాధ్యాయుడు పాఠాన్ని బోధించిన అనంతరం విద్యార్థులతో నేరుగా డిస్కస్ చేసి డౌట్స్‌ను క్లారిఫై చేస్తారు. ఇదివరకు పాఠాలు పది నిమిషాలు వినగానే బోర్ కొట్టేవని, ఇప్పుడు ఇష్టంగా నేర్చుకుంటున్నామని చెబుతున్నారు విద్యార్థులు.పాఠశాలలో సమర్థవంతమైన బోధనతో విద్యార్థులకు స్మార్ట్‌ బోర్డ్‌ విద్యను అందుబాటులోకి వచ్చింది.
మండలంలో :డిజిటల్‌ విద్యతో పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగు పడుతూ బ్లాక్‌ బోర్డులు మరుగున పడనున్నాయి. ప్రైవేట్‌ పాఠశాలకు దీటుగా మెరుగైన విద్యనందించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ విద్యను ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నల్గొండ జిల్లా పెద్దవూర మండలం లోని పెద్దవూర, పెద్దగూడెం, చలకుర్తి, నాగార్జున సాగర్, పెద్దగూడెం వెల్మగూడెం, పులిచర్ల,గ్రామాల్లో ని జెడ్పి హెచ్ ఎస్ ఉన్నత పాఠశాలలో 8,910 వ తరగతి విద్యార్థుల కు ఒక్కో పాఠశాల కు మూడు డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేశారు.
స్మార్ట్ బోర్డు పై విద్యాబోధన చేస్తున్న ఉపాధ్యాయులు: ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు సంబంధిత ఉపాధ్యాయులు స్మార్ట్‌ బోర్డులపై డిజిటల్‌ తరగతులను బోధిస్తున్నారు. గతంలో బ్లాక్‌ బోర్డులపై సుద్దముక్కలతో రాస్తూ విద్యార్థులకు విశదీకరించడం వంటి పద్దతులకు స్వస్తి పలికి స్మార్ట్‌ బోర్డులలో రికార్డు అయివున్న తరగతులను సులభంగా బోధించడంతో పాటు ఆయా బోర్డులపైనే రాసే వీలుండటంతో బ్లాక్‌ బోర్డులతో తరగతుల నిర్వహణ తగ్గిపోయింది. జిల్లాలో వున్న అన్ని పాఠశాలల్లో 9 మంది ట్రైనర్స్‌తో పాఠశాల ఉపాధ్యాయులకు ఎప్పటికప్పుడు తర్ఫీదునిస్తూ డిజిటల్‌ విద్యను బలోపేతం చేస్తున్నారు.
ఎప్పటికప్పుడు రికార్డు: స్మార్ట్‌ బోర్డుల్లో ప్రీ ప్రైమరీ నుంచి పదో తరగతి వరకు రికార్డు అయి ఉంటాయి. వాటిని ఆయా తరగతుల ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధించవచ్చు. బోర్డులపై ప్రత్యేక టూల్స్‌తో రాస్తూ విద్యార్థులకు మరింత సులువుగా బోధించవచ్చు. ఉపాధ్యాయులకు ఏమైనా సందేహాలుంటే టైనర్లు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి వెంటనే వాటిని నివృత్తి చేస్తారు.
స్కూల్లో పాఠాలు మంచిగా అర్ధమవుతున్నాయి: స్టూడెంట్.. పదవ తరగతి.. బిందుశ్రీ, పెద్దగూడెం
డిజిటల్ క్లాసులు వింటుంటే సినిమా హాల్లో వున్నట్లు గా వుంది. క్లాసులు బాగా అర్ధం అవుతున్నాయి. వీడియో క్లిప్పింగుల రూపంలో బోధన ఉండడం తో ఇంకొంచెం సేవు పాఠాలు వినాలని పిస్తుంది.ఇంకొంచెం సేవు క్లాస్ ఉంటే బాగుండేది అనే బావన కలుగుతుంది.బోరు కొట్ట కుండా సులువుగా అర్ధం అవుతున్నాయి.మంచి జీపిఏ సాధించవచ్చు అనే పట్టుదల కలుగుతుంది.