– డిజిటల్ మీడియా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సవాళ్ళ గురించి డిఎమ్ జేయు లేఖ
నవతెలంగాణ – హైదరాబాద్:
నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మీడియా అకాడమి చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి శుభాకాంక్షలు. సాంకేతిక పరిజ్ఞానం పెరిగాక సామాజిక మధ్యమాల్లో మార్పులు వచ్చాయి. ఒకప్పుడు ప్రింట్ మీడియా, ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా, ప్రస్తుతం డిజిటల్ మీడియా అనివార్యం అయ్యింది. ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఎప్పటి సమాచారాన్ని అప్పుడే తెలుసుకోవనుకుంటున్నారు ప్రజలు. డిజిటల్ మీడియా అవసరం అందరికీ తెలిసిందే..గతం లో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసిన జర్నలిస్టులు వారి వ్యక్తిగత పరిస్థితుల రీత్యా ఇప్పుడు డిజిటల్ మీడియా లో పనిచేస్తూ వార్తలను సేకరిస్తున్నారు.ఎన్నో కష్ట నష్టాలను భరిస్తూ డిజిటల్ మీడియా లో రిపోర్టింగ్ చేస్తున్న వారిపై దాడులు చేస్తూ, డిజిటల్ మీడియాను తక్కువ చూస్తున్నారు. ఈరోజు డిజిటల్ మీడియా ప్రాముఖ్యతను సంతరించుకుంది.శాటిలైట్ మీడియాకు కూడా అనివార్యంగా డిజిటల్ మీడియా అవసరం అయ్యింది. నిరంతరం వార్తలు కవరేజ్ చేస్తున్న డిజిటల్ మీడియా లో టెలికాస్టింగ్, పబ్లిషింగ్ చేస్తున్న వారందరినీ ప్రభుత్వం, మీడియా అకాడమీ, ఐ అండ్ పి ఆర్, డీపీరో గుర్తించి వారిని జర్నలిస్ట్ గా గుర్తించి అక్రీడిటేషన్ కార్డు ఇవ్వాలి. జర్నలిస్టుల భద్రత కోసం మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలి. ఈ కార్యక్రమంలో డిఎమ్ జేయు వ్యవస్థాపకులు,ఎంపెల్లి ముతేష్,రాష్ట్ర అధ్యక్షులు,కే రాజేంద్ర ప్రసాద్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,బొడ్డు అశోక్,జాతీయ నాయకులు,చందా శ్రీనివాస్ తదితరులు పాల్గోన్నారు
డిమాండ్స్
– డిజిటల్ మీడియాలో పని చేస్తున్న వారిని జర్నలిస్ట్ గా గుర్తించాలి
– ప్రతీ డిజిటల్ మీడియా జర్నలిస్ట్ కు అక్రిడిటేషన్ కార్డు ఇవ్వాలి.
– మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలి.