దిక్సూచి 2.0 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే

నవతెలంగాణ – కంటేశ్వర్
ఇందూర్ నగరం పట్టణ వైశ్య సంఘం లో ఆర్య వైశ్య గ్రాడ్యుయేట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన దిక్సూచి-2.0 కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అనంతరం ధన్ పాల్ మాట్లాడుతు.. ఆర్య వైశ్య గ్రాడ్యుయేట్ అసోసియేషన్ వారు దిక్సూచి పేరుతో యువతకు దిశనిర్దేశం చేస్తూ, యువత లో ప్రతిభను వెలికితీయడం కోసం వారికీ ఉపాధి అందించే లక్ష్యంతో, యువతకు ఉచిత కంప్యూటర్ ట్రైనింగ్, అలాగే జాబ్ మేళా నిర్వహించి ఉద్యోగ కల్పన వంటి అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, ఇప్పుడు విద్యార్థులకు,వారి తల్లితండ్రులకు పిల్లల భవిష్యత్ పైన పై చదువుల ప్రాముఖ్యం, వేదిక్ మ్యాస్ యొక్క ప్రాముఖ్యత గురించి వివరిస్తూ ఇలాంటి సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆర్య వైశ్య గ్రాడ్యుయేట్ అసోసియేషన్ కీ శుభాకాంక్షలు తెలుపుతూ వారికీ ఎల్లవేళలా అండగా ఉంటానని తన ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థుల చదువులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలియజేసారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు కుక్కుట్ల నవీన్ కుమార్,డా బి సాయి కిరణ్ గిన్నిస్ వరల్డ్ బుక్ రికార్డర్, డా కాంచన్ ముప్కాల్కర్, బీజేపీ నాయకులు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగోల్ల లక్ష్మీనారాయణ, కార్పొరేటర్, ఇల్లందుల ప్రభాకర్,మఠం పవన్,పవన్ ముందడ, మరవర్ కృష్ణ, శేఖర్,తదితరులు పాల్గొన్నారు.