దర్శకుడు అజరు భూపతి తెరకెక్కించిన సినిమా ‘మంగళవారం’.హొపాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రానికి అజరు భూపతి ఎ క్రియేటివ్ వర్క్స్ నిర్మాణ భాగస్వామి. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మతో కలిసి నిర్మించారు. శుక్రవారం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైంది. విశేష ప్రేక్షకాదరణతో సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ లభించింది. మంచి వసూళ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం సక్సెస్ మీట్ నిర్వహించారు.హొ ఈ చిత్రాన్ని నైజాంలో పంపిణీ చేసిన నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ, ‘ఈ కథ విన్నప్పుడు వంశీ ‘అన్వేషణ’ గుర్తుకు వచ్చింది. కథ నచ్చడంతో నైజాం తీసుకున్నా. కథ నాకు తెలిసినా సాధారణ ప్రేక్షకుడిలా ప్రీమియర్ చూశా. ‘అరుంధతి’ సినిమా చూసినప్పుడు ఏదైతే ఫీల్ కలిగిందో… అలా అనిపించింది. ఈ రోజు ప్రేక్షకులు సినిమా బావుందని అనడానికి కారణం క్లైమాక్స్, ఆ ట్విస్టులు. తొలి సినిమాతో సక్సెస్ అందుకున్న నిర్మాత స్వాతికి కంగ్రాట్స్. మౌత్ టాక్ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్పడానికి ఇదే సాక్ష్యం’ అని తెలిపారు. ‘పెయిడ్ ప్రీమియర్ బుకింగ్స్‌హొస్టార్ట్ చేసిన తర్వాత సాయంత్రానికి ఆల్మోస్ట్ హౌస్ ఫుల్స్‌హొఅయ్యాయి. తర్వాత పెయిడ్ ప్రీమియర్ షోలు పెంచాం. సినిమా చూసిన వాళ్ళు ఎంతో బాగా చూపించారు. ‘ఆర్‌ఎక్స్ 100’ కంటే బెస్ట్ సినిమా అంటున్నారు. టేకింగ్, అజనీష్ మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో చెప్పా… ‘ఇది టెక్నీషియన్స్ మూవీ’ అని! ఈ రోజు అందరూ టెక్నికల్ వర్క్, ట్విస్ట్స్ గురించి మాట్లాడుతుంటే సంతోషంగా ఉంది. ఈ సినిమాతో ప్రేక్షకులహొనుంచి నాకు రెస్పెక్ట్ లభించింది. అవుటాఫ్ బాక్స్ స్టోరీ తీసుకుని హిట్ అందుకున్నందుకు సంతోషంగా ఉంది. పాయల్ కూడా చక్కగా నటించింది’ అని దర్శకుడు అజరు భూపతి చెప్పారు. పాయల్‌హొరాజ్‌పుత్ మాట్లాడుతూ ‘ఈ సినిమా హిట్ అవుతుందని నేను ముందే అనుకున్నా. కానీ, ఇంత పెద్ద హిట్ అవుతుందని అనుకోలేదు. నాకు చాలా సంతోషంగా ఉంది. నా జీవితంలో మోస్ట్ ఛాలెంజింగ్ రోల్ అజరు భూపతి ఇచ్చారు. ‘ఆర్‌ఎక్స్ 100’, ఇప్పుడు ‘మంగళవారం’ ఇచ్చారు. ఒక్క సినిమాతో నా పని అయిపోతుందనిహొఅనుకున్నారు. ‘మంగళవారం’తో అది తప్పు అని నిరూపించా’ అని అన్నారు.
మా సినిమాకు ఇంత రెస్పాన్స్ ఇచ్చి, మాకు ఇంత పెద్ద విజయం అందించిన ప్రేక్షకులకు థ్యాంక్యూ. ఈ రోజు సక్సెస్ మీట్‌లో కూర్చుంటానని అసలు అనుకోలేదు. నా కలను నిజం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
– నిర్మాత స్వాతి రెడ్డి గునుపాటి
ప్రేక్షకుల స్పందన చూస్తుంటే మాటలు రావడం లేదు. కథపై నమ్మకంతో నేను, మా తమ్ముడు అజరు, స్వాతి రెడ్డి గునుపాటి సినిమా చేశాం. కొత్త నిర్మాతలు, కొత్త కథతో తీసిన సినిమానుహొఇంతహొఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్స్.
– నిర్మాత ఎం. సురేష్ వర్మ