శిథిలావస్థకు తహసీల్దార్‌ కార్యాలయం

– మరమ్మత్తులు చేయించాలి : సీపీఐ(ఎం)
నవతెలంగాణ-నిడమనూరు
నిడమనూరు తహాసీల్దార్‌ కార్యాలయం శిథిలావస్థకు చేరిందని, వెంటనే మరమ్మత్తులు చేయించాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కొండేటి శ్రీను, మండల కార్యదర్శి కందుకూరి కోటేష్‌ ప్రభుత్వాన్ని కోరారు. గురువారం మండల కమిటీ ఆధ్వర్యంలో బందంతో కలిసి తహసీల్దార్‌ కార్యాలయ భవనాన్ని పరిశీలించిన అనంతరం వారు మాట్లాడారు. 2005 సంవత్సరంలో నిర్మించిన తహసీల్దార్‌ కార్యాలయం 20 సంవత్సరాలు పూర్తి చేసుకోకుండానే శిథిలావసకు చేరిందన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నాసిరకం పనులు చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. భవనం పై పెచ్చులు ఏ క్షణాన విరిగి మీద పడతాయని సిబ్బంది, కార్యాలయానికి వచ్చి పోయేవారు భయాందోళనకు గురవుతున్నారని చెప్పారు. రోజు సీలింగ్‌ పెచ్చులు ఊడి కింద పడుతున్నాయని ప్రశాంతంగా సిబ్బంది విధులు నిర్వహించలేకపోతున్నారని పేర్కొన్నారన్నారు. పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి తహశిల్దార్‌ కార్యాలయం మరమ్మతులు పకడ్బందీగా చేయించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు కోమండ్ల గురువయ్య, కుంచెం శేఖర్‌, వింజమూరు శివ, ముత్యాల కేశవులు, వింజమూరు పుల్లయ్య తదితరులు ఉన్నారు.