
నవతెలంగాణ- జక్రాన్ పల్లి
మండల కేంద్రంలోని పశువైద్యశాల శిథిలావస్థకు చేరుకుంది. వర్షం పడుతున్నప్పుడు పశు వైద్యశాల స్లాబు పెచ్చులు ఊడడంతో ప్రాణభయంతో సిబ్బంది వైద్య సేవలను అందిస్తున్నారు. పశు వైద్యశాల 1974 సంవత్సరంలో నిర్మించడం జరిగింది. దాదాపుగా 49 సంవత్సరాల నుంచి పశు వైద్యశాల కొనసాగుతూ వైద్య సేవలను అందిస్తున్నారు గత రెండు సంవత్సరాల నుంచి పశువైద్యశాల స్లాబు పెచ్చులు ఊడి వర్షం పడడంతో వైద్యశాలంతా నీటితో నిండిపోవడంతో సిబ్బంది కాలు పెట్టలేని పరిస్థితిలో ఉండి యాదవులకు రైతులకు వైద్య సేవలను అందిస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యమా ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యమా పశు వైద్యశాల పట్ల నిర్లక్ష్యం వహించడంతో వర్షాలు పడినప్పుడు పై పెచ్చులు ఊడి పశు వైద్య సిబ్బందిపై రైతులపై యాదవులపై పడే అవకాశం ఉంది వర్షం పడితే వైద్యశాలలో నిలబడలేక పోతున్నామని రైతులు యాదవులు అంటున్నారు. పశు వైద్యశాలలో వర్షపు నీరు రావడంతో వైద్యశాలలో ఉన్న బీరువాలు డాక్యుమెంటు చెడిపోయే ప్రమాదము ఉంది. ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారులు పశువైద్యశాలపై ప్రత్యేక దృష్టి సారించి పశు వైద్యశాలను నూతనంగా నిర్మించాలని రైతులు యాదవులు కోరుతున్నారు. సతీష్ యాదవ్ పడకల్ మండల కేంద్రంలోని పశువైద్యశాల శిథిలావస్థకు చేరుకుంది పశు వైద్యశాలకు వెళ్లి జీవాలకు మందులు తెచ్చుకోవాలంటే వర్షం పడినప్పుడు పశువైద్యశాలలోకి వెళ్లి నిలబడలేని పరిస్థితి ఉంది. ప్రభుత్వము యాదవులకు గొర్రెల యూనిట్లకు సంబంధించిన డాక్యుమెంటు కొరకు సంతకాలకు వెళ్ళినప్పుడు స్లాబు ఊరువడంతో నిలవడానికి జాగలేదు డాక్యుమెంటు తడిసిపోయే ప్రమాదము ఉంది వెంటనే పశు వైద్యశాలకు నిధులు మంజూరు చేసి పశు వైద్యశాల నిర్మించాలి.
సుమన్ యాదవ్ పడకల్
మండల కేంద్రంలోని పశు వైద్యశాల శిథిలావస్థకు చేరుకుంది పశువైద్యశాలను నిర్మించి మా జీవాలకు సరైన మందులు సరైన వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. పశు వైద్యశాల మరమ్మత్తులైన చేపట్టి వైద్య సేవలు అందించే విధంగా ప్రభుత్వము ప్రయత్నం చేయాలని కోరారు.
పశు వైద్యాధికారి శిరీష
మండల కేంద్రంలోని పశువైద్యాధికారి శిరీషను వివరణ కోరగా. పశు వైద్యశాల శిథిలావస్థకు చేరుకున్నదని పై అధికారులకు పలుమార్లు విన్నవించడం జరిగిందని తెలియజేశారు.
జిల్లా పశువైద్యాధికారి జగన్నాథ చారి
జిల్లా జాయింట్ డైరెక్టర్ జగన్నాథ చారిని వివరణ కోరగా జిల్లాలో శిథిలావస్థకు చేరుకున్న 19 పశువైద్యశాలలు ఉన్నాయన్నారు రాష్ట్ర ప్రభుత్వము అడిగినప్పుడు గత రెండు నెలల క్రితమే పశు వైద్యశాలలకు నిధులు మంజూరు చేయాలని ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు. డిపార్ట్మెంట్ కు వచ్చిన బడ్జెట్ ప్రకారము రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు అయితే పశువైద్యశాలలు నిర్మించే అవకాశం ఉందన్న.