నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ గా దిలీప్ కుమార్ మంగళవారం బాధ్యతలను మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో స్వీకరించారు. మేడ్చల్ జెడ్పీ సీఈవోగా పని చేసిన ఆయన బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ.. నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తిన సమాచారం అందించాలన్నారు. ప్రజలకు సిబ్బంది అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయాలని ఆదేశించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ చాంబర్ లో బాధ్యతలు స్వీకరించిన దిలీప్ కుమార్ కు డిప్యూటీ కమిషనర్ తో పాటు ఉద్యోగులు, సిబ్బంది స్వాగతం పలికి పుష్పగుచ్ఛాలు అందజేశారు.