భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ ఎఫ్ ఐ) నిజామాబాద్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో మంగళవారం జరిగిన జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో నూతన జిల్లా కమిటీ సభ్యుడిగా తెలంగాణ యూనివర్సిటీ కి చెందిన యూనివర్సిటీ ఉపాధ్యక్షులు దినేష్ నూతన జిల్లా కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. భవిష్యత్తులో ప్రైవేట్ కార్పొరేట్ ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా, తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధి కొరకు నిరంతరం పాటు పడుతు అయినా సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేస్తానని, జిల్లా కమిటీ నాపై నమ్మకంతో ఈ అవకాశం కల్పించడం సంతోషకరమని అన్నారు. విద్య రంగంలోని సమస్యల పై అలుపెరగని పోరాటాలను రూపొందించి ఆనేక పోరాటాలు నిర్వహిస్తానిమని ఎన్నికకు సహకరించిన ఎస్ ఎఫ్ ఐ జిల్లా కమిటీకి సభ్యులకు ధన్యవాదాలు,కృతజ్ఞతలు తెలిపారు.