బల్మూర్ వెంకట్ కు ఎమ్మెల్సీ ఇవ్వడం హర్షనీయం : పున్న దినేష్

 

నవతెలంగాణ – డిండి
ఎన్ఎస్ యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూర్ వెంకట్ కి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వడం పట్ల ఎన్ఎస్ యుఐ రాష్ట్ర కార్యదర్శి పున్న దినేష్ బుధవారం ఒక ప్రకటన లో  హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వానికి , తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. గత పదేళ్లుగా తెలంగాణ విద్యార్థులకు , నిరుద్యోగులకు ప్రతి అంశంలో తోడుగా వుంటూ, పలు సార్లు జైలుకు వెళ్లి పార్టీ బలోపేతం కోసం నిరంతరం పోరాటం చేసిన బల్మూర్ వెంకట్ కి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఎమ్మెల్సీ కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.