డింగ్‌ లిరెన్‌ జోరు

డింగ్‌ లిరెన్‌ జోరు– తొలి గేమ్‌లో గుకేశ్‌ ఓటమి
– ప్రపంచ చెస్‌ చాంపియన్‌షిప్‌
సింగపూర్‌ : ప్రపంచ చెస్‌ చాంపియన్‌షిప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్‌ డి. గుకేశ్‌కు తొలి ఆటలోనే నిరాశ ఎదురైంది. సోమవారం జరిగిన తొలి గేమ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ డింగ్‌ లిరెన్‌ విజయం సాధించింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో14 ఏండ్ల తర్వాత తొలి గేమ్‌లోనే ఫలితం రావటం గమనార్హం. ఓ దశలో సమయం మించిపోతుండగా.. వేగంగా పావులు కదిపిన లిరెన్‌ తన రాణితో ఫ్రెంచ్‌ డిఫెన్స్‌లో వేసిన ఎత్తులు గుకేశ్‌ను ఒత్తిడిలో పడేశాయి. చాకచక్యంగా గుకేశ్‌పై ఒత్తిడి పెంచిన లిరెన్‌ తొలి గేమ్‌లో విజయం సాధించాడు. నేడు గుకేశ్‌, లిరెన్‌ రెండో గేమ్‌లో పోటీపడనున్నారు.