డిసెంబర్ 21 నుండి 23 వరకు నిర్మల్ జిల్లా ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన 67వ స్కూల్ గేమ్స్ రాష్ట్ర స్టాప్ బాల్ అండర్-17 పోటీలలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ధర్మారం బి క్రీడాకారిణి దిపా జిల్లా జట్టు తరఫున పాల్గొని జట్టు బంగారు పతకం సాధించడంలో కీలకపాత్ర పోషించి ఈనెల 10 నుండి 15 వరకు రాజస్థాన్ రాష్ట్రంలోని బికినీర్ లో జరగనున్న జాతీయ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ సంగీత తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ నీరజ రెడ్డి, పిఈటీ జోష్ణ ,హౌస్ టీచర్స్ దమయంతి, స్కూల్ స్టాప్ దిపా ను ప్రత్యేకంగా అభినందించారు.