నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
టీఎస్‌ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం డైరీ-2024ను రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షి, ఆ సంఘం గౌరవాధ్యక్షులు, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మెన్ మధుయాష్కీగౌడ్ ఆవిష్కరించారు. బుధవారం హైదరబాద్‌లోని గాంధీభవన్‌లో డైరీ ఆవిష్కరించిన తర్వాత ఉద్యోగులకు వారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.ఏ.రెహ్మాన్ సూఫీ, ప్రధాన కార్యదర్శి బివి. కోటయ్య, కోశాధికారి బుచ్చిరెడ్డి, కార్యదర్శులు మునగాల మనోహర్, భూపాల్‌రెడ్డి, పూస నర్సింహా బెస్త తదితరులు పాల్గొన్నారు.