నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సంగారెడ్డి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను రెండేండ్ల డిప్లొమో ఇన్ ఆప్తాల్మిక్ అసిస్టెంట్ కోర్సును ప్రారంభించినట్టు ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో 30 సీట్లు ఉండగా, డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్ కోర్సులోనూ 30 సీట్లు ఉన్నాయని చెప్పారు. ఇందులో ప్రవేశాల కొరకు ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. ఏదైనా సందేహాలుంటే ఫోన్ నెంబర్ 73829 44897లో ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సంప్రదించాలని సూచించారు.