– పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్
న్యూఢిల్లీ : తెలంగాణ పారా స్ప్రింటర్ దీప్తి ప్రపంచ రికార్డు బద్దలు కొట్టింది. ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో బంగారు పతకం సాధించిన దీప్తి.. మహిళల టీ20 400 మీ పరుగులో రికార్డు నెలకొల్పింది. అర్హత పరుగులో 56.18 సెకండ్లతో పారిస్ పారాలింపిక్స్ బెర్త్ ఖాతాలో వేసుకుంది. ఫైనల్లో రేసును 55.07 సెకండ్లలోనే ముగించి ప్రపంచ రికార్డుతో పసిడి పతకం సొంతం చేసుకుంది. మెన్స్ డిస్కస్‌త్రోలో యోగేశ్ 41.80 మీటర్లతో సిల్వర్ మెడల్ సాధించాడు.