నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా కేంద్రంలో సిరిసిల్ల రోడ్లో శనివారం దద్ధమైన విద్యుత్ సబ్స్టేషన్ ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ అశోక్ కుమార్ బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్పీడీసీఎల్ సీఎండీ కే. వరుణ్ రెడ్డి ఆదేశాల మేరకు దగ్ధమైన సబ్ స్టేషన్ను తనిఖీ చేయడం జరిగిందన్నారు. పవర్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడం పై అధికారులను వివరాలను అడిగి తెలుసుకోవడం జరిగిందన్నారు. అంత అగ్ని ప్రమాదం జరిగినా గంట 30 నిమిషలలో విద్యుత్ ను అన్ని ప్రాంతాలకు పునారిద్దరించడం పై హర్షం వ్యక్తం చేసారు. కాలిపోయిన ట్రాన్స్ఫర్మెర్ల వద్ద కొత్త ట్రాన్స్ఫార్మర్ లు సిఎండి ఆదేశాల తో అలాట్ చేశామన్నారు. ఇకముందు ఇలాంటి ప్రమాదలు జరగకుండా సబ్సటేషన్ లో సూచనలు ఇచ్చి యద్ధ ప్రాతిపదికన, త్వరతగతిన మారామ్మత్తులు చేయాలాన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎన్.శ్రవణ్ , డి ఇ ఇ కళ్యాణ్ చెక్రవర్తి, డి ఇ ఇ టెక్ ప్రభాకర్, డి ఇ ఇ , ఎమ్మాఆర్టి ఎం ఆర్ టి కే.నాగరాజు, ఈ ఈ సివిల్ కే. స్వామి, ఏ డి ఈ, డి. కిరణ్ చైతన్య, ఏడిఈ హెచ్టీ వి సతీష్, ఏడిఈ ప్రొటెక్షన్ కే జైరాజ్, ఏడిఈ చంద్రకాంత్ రావు, ఏఈ లు రంజిత్, వి.ప్రదీప్ కుమార్, పి హన్మంత్ రెడ్డి, శ్రీనివాస్, పి. మనోరంజాన్ కార్తీక్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.