నవతెలంగాణ-నస్పూర్
శ్రీరాంపూర్ ఏరియాలోని ఉపరితల గనిని డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ జి వెంకటేశ్వర్‌రెడ్డి, జనరల్ మేనేజర్ బి సంజీవరెడ్డితో కలిసి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ క్వారీలోని జీవీఆర్, సీఆర్‌ఆర్ ఓబి కాంట్రాక్టు కంపెనీ ప్రతినిధులతో రోజువారి నిర్దేశిత లక్ష్యం లక్ష్య క్యూబిక్ మీటర్లను తప్పనిసరిగా తీయాలని సూచించారు. దానికి సంబంధించి అన్ని ప్రణాళికలు వేసుకోవాలని, వర్షపు నీరు నిలవకుండా చూసుకోవాలన్నారు. బొగ్గు ఉత్పత్తికి ఎటువంటి ఆటంకం కలగకుండా చూసుకోవాలని అలాగే రక్షణతో కూడిన ఉత్పత్తి ఉత్పాదకత సాధించడానికి ప్రతి ఒక్క ఉద్యోగి అధికారి కృషి చేయాలని సూచించారు. ఈ ఆర్థిక సంవత్సరం నిర్దేశిత ఉత్పత్తి ఉత్పాదకత సాధించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉపరితల గనుల ప్రాజెక్టు ఆఫీసర్లు శ్రీనివాస్, శ్రీనివాస్, గని మేనేజర్ బ్రహ్మాజీ, సర్వే అధికారి సంపత్ పాల్గొన్నారు.