
ఇందల్ వాయి మండలంలోని ఇందల్ వాయి సహకార సొసైటీ డైరెక్టర్లు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇందల్ వాయి మండలంలోని చంద్రాయన పల్లి కి చెందినా గడ్డం గంగారెడ్డి, ఇందల్ వాయి తండాకు చెందిన భదవత్ చందర్ నాయక్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డీ సమక్షంలో పార్టీలో చేరారు. చేరిన వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఇందల్ వాయి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోత్కూరి నవీన్ గౌడ్, ఇందల్ వాయి సహకార సొసైటీ వైస్ చైర్మన్ పాల్తీయ మారుతీ, డైరెక్టర్ భదవత్ సుధాకర్, కుమ్మరి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.