కాంగ్రెస్ పార్టీలో చేరిన సొసైటీ డైరెక్టర్లు

నవతెలంగాణ – భీంగల్
మండలంలోని ముచ్కూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం 9 మంది డైరెక్టర్లు  బుధవారం బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్  రెడ్డి  సమక్షంలో  పార్టీలో చేరారు . వీరికి  సునీల్ రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. చేరిన వారిలో డైరెక్టర్లు  బంగ్లా దేవేందర్, బంగ్లా లక్ష్మీ నరసింహ గౌడ్, బురెడ్డి గంగారెడ్డి,బురెడ్డి చిన్న రాజన్న, ఈదపు శ్రీనివాస్, కైరి లక్ష్మి, తెడ్డీ లావణ్య, బొమ్మెన సాయన్న, వడ్యాల లక్ష్మణ్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోధిరె స్వామి, జె జె నర్సయ్య, ముచ్కూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు సంతోష్, లింబాద్రి, కొరాడి రాజు, రాజేష్, నరేందర్ నేనావత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
బీజేపీ, బీఆర్ ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి  చేరికలు
మండలంలోని పల్లికొండ, చెంగల్  గ్రామాలకు చెందిన బీజేపీ, బీఆర్ ఎస్ నాయకులు  బుధవారం  ముత్యాల సునీల్  రెడ్డి  సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో  చేరారు. చేరిన వారిలో  గంగ సురేష్, రాజ్ కుమార్, హరీష్, అనిల్,వంశీ,గంగాధర్, బాలకిషన్,సురేష్,మోహన్ లు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోధిరె స్వామి, కుంట రమేష్, జెజె నర్శయ్య, ఎంపీటీసీ కృష్ణ,రాజేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.