– వార్తకు స్పందన…
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
ఈనెల 22న నవతెలంగాణలో ప్రచురితమైన మురికి గుంతల మారిన గేట్ వల్వ్ అనే వార్త కథనానికి అధికారులు స్పందించారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బస్టాండ్ ప్రాంతంలో ఉన్న మంచినీటి పైప్లైన్ గేట్ వాల్వ్ మురికి గుంతల మారి చెత్తాచెదారం చేరడంతో నవ తెలంగాణ కెమెరాకు చిక్కింది. దీంతో ప్రచూరితమైన కథనానికి అధికారులు స్పందించి వెంటనే గేట్ వాల్వును శుభ్రం చేయించి దాని చుట్టూ మురికి నీరు చేరకుండా సిమెంటు రింగ్ ను ఏర్పాటు చేశారు.