– పట్టించుకోని ప్రత్యేక అధికారి గ్రామపంచాయతీ సిబ్బంది
నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
మండలంలోని పోచారం తాండ గ్రామ పంచాయతీలో మురికి కాలువల్లో మురికి చెత్త చెదరంతో నిండిపవడంతో దుర్వాసనలు రావడంతో ప్రజాలకు ఇబ్బందిగా మారిందని ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు. గ్రామ పంచాయతీ అధికారులు మురికి కాలువల్లో చెత్త పేరుకుపోయిన నెలల తరబడి చెత్తను తొలగిచడం లేదని జనాలు అంటున్నారు.గత బి.ఆర్. ఎస్ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీ కి చెత్త సేకరణ కొరకు ట్రాక్టర్ ట్రాలీలను అందించడం జరిగింది. వాటిని సక్రమంగా వినియోగించి గ్రామ పంచాయతీ పరిధిలో తొలగించిన చెత్తను విధులలో తిరుగుతూ ట్రాక్టర్ ద్వారా సేకరించి డంపింగ్ యార్డులో పరేయాలి. పోచారం తండాలో మాత్రం నెలకు ఒక్కసారి కూడా మురికి కాలువలో మురికితో నిండిన తొలగించకపోవడం గమనార్హం.నిండిన మురికి కాలువలో నిండిన నీటిలో దోమలు ఎక్కువ కావడంతో జనాలు జ్వరాల బారినపడే అవకాశాలు ఉన్నాయని జనాలు అంటున్నారు.