నవతెలంగాణ- పెద్దకొడప్ గల్
మండలంలోని చిన్న దేవి సింగ్ తండాలో రోడ్డుపై ప్రవహిస్తున్న మురికి నీరు వాహనదారులకు అనేక ఇబ్బందులు పట్టించుకోని అధికారులుప్రత్యేక అధికారులు పర్యవే క్షణ లోపంతో మురికి కాలువల్లో చెత్తాచెదారం నిండి మురికి నీరు రోడ్డుపైనే ప్రవహిస్తోంది. డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారినా ఏ ఒక్కరు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. క్రమం తప్పకుండా శుభ్రం చేయడం లేదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈగలు, దోమల బెడద అధికమై అనారోగ్యం పాలవుతున్నట్లు, అలాగే రో డ్డు రాకపోకలకు ఇబ్బందిగా మారినట్లు ఆరోపిస్తు న్నారు. అధికారులు పారిశుధ్యంపై తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.