
మండల కేంద్రంలోని ఎస్బిఐ బ్యాంక్, పోస్ట్ ఆఫీస్ ప్రాంతాలలో మురికి నీరు రోడ్లపై ప్రవహిస్తుంది. బ్యాంకు, పోస్ట్ ఆఫీస్ కు వెళ్లే ఖాతాదారులు, కాలనీవాసులు మురికినీటి వాసనతో అనేక ఇబ్బందులు పడుతున్నామని పట్టణ ప్రజలు తెలిపారు. గ్రామపంచాయతీ అధికారులు స్పందించి మురికి నీరు సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.