పాఠశాల విద్యార్థుల్లో వైకల్యాలను గుర్తించి ప్రశస్త్ యాప్‌లో నమోదు చేసే బాధ్యత హెచ్ఎంలతో పాటు ఆయా తరగతి ఉపాధ్యాయులపై ఉంటుందని ఎంఇఓ రమణ రేడ్డి తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రెండు రోజుల నుంచిజరుగుతున్న ప్రశాస్తా శిక్షణ ముంగిపు సందర్భంగా హాజరై ఆయన మాట్లాడారు. విద్యార్థుల్లో గుర్తించిన వైకల్యాలను మదింపు చేయడానికి, ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు ప్రతి విద్యార్థిని పరిశీలించి రిపోర్టును యాప్‌లో పొందుపర్చాలన్నారు. యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునే విధానాన్ని స్పెషల్ టీచర్ సాయికృష్ణ ఐఈఆర్పీ విజయ్ కుమార్ వివరించారు. సమావేశంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మండలాలకు చెందినప్రభుత్వ, ప్రయివేటు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు, సీఆర్పీలు ఎక్బల్ , భూమన్న, రాములు,పాల్గొన్నారు.