భారతదేశంలో సుమారు 21 మిలియన్ల మంది అనగా రెండు శాతం జనాభా వికలాంగులుగా ఉన్నట్లు తెలుస్తోంది. దేశ సమ్మిళిత అభివృద్ధిలో వీరి పాత్ర కూడా సముచితంగా ఉండాలని పలు నివేదికలు చెబుతున్నాయి. చిన్న చిన్న లోపాలు, అంగవైకల్యం ఉన్నంత మాత్రాన, వీరి పట్ల ఎవరూ వివక్షత చూపరాదు. ఇటీవల చైనాలో జరిగిన పారా ఆసియన్ గేమ్స్‌లో వీరు క్రీడా నైపుణ్యాలు, సామ ర్థ్యాలు ద్వారా మనదేశానికి 111 పతకాలు సాధించి దేశ గౌరవాన్ని కీర్తి ప్రతిష్టలు ఇనుమడింప చేసారు. ఇక దేశ ఆర్థికాభివృద్ధికి కేంద్రాలు అయిన పరిశ్రమలు, ఆఫీస్లు, ఉద్యోగ ఉపాధి కేంద్రాల్లో అనగా ”వర్క్ ఫోర్స్” లో వీరికి అవకాశాలు బహు తక్కువగా ఉంటున్నాయి. మొత్తం విక లాంగుల్లో కేవలం 36 శాతం మాత్రమే పనిలో భాగ స్వామ్యం (వర్కర్లు) ఉండుట గమనార్హం. ఇందులో పురు షులు 47శాతం కాగా, మహిళలు కేవలం 23శాతంగా ఉన్నారు. ఇక్కడ కూడా లింగ వివక్షత స్పష్టంగా కనిపి స్తుంది. అంతేకాకుండా వికలాంగుల్లో గ్రామీణ ప్రాంతాల్లో 25 శాతం ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతుండగా, పట్టణ ప్రాంతాల్లో కేవలం 16 శాతం మంది మాత్రమే ఉపాధి అవకాశాలు పొందుతున్నారని నివేదికలు పేర్కొం టున్నాయి. ప్రభుత్వ రంగంలో, ప్రయివేటు రంగంలో సరైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించుట లేదు. 2019 ”ఆక్స్ఫామ్” నివేదిక ప్రకారం అవిద్య, నైపుణ్యాలు లేమి, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో వెనుకబాటుతనం, చిన్నచూపు, వివక్షత వంటి కారణాల వల్ల వికలాంగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోలేకపోతున్నారు అని తెలిపారు. వీరికి పని ప్రదేశాలు అందుబాటులో లేకపోవడం, రవాణా సౌకర్యాలు లేకపోవడంతో వర్క్ ఫోర్స్‌లో భాగస్వామ్యం కాలేకపోతున్నారు. విద్యా సౌక ర్యాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. మరి భవి ష్యత్తులో మనదేశాన్ని మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందించుటకు చర్యలు తీసుకుంటున్నామని చెబు తున్న పాలకులు దేశంలో రెండు శాతంగా ఉన్న వికలాం గుల్ని సమ్మిళిత అభివృద్ధిలో భాగస్వామ్యులుగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
– ఐపి రావు