
నవతెలంగాణ-గోవిందరావుపేట
దివ్యాంగులు ధైర్యంతో ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయాలని కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి జిల్లా న్యాయ అధికార సంస్థ ములుగు జడ్జి టీ మాధవి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ, ములుగు ఆధ్వర్యంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం మరియు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో భాగంగా డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారి సహాయంతో రైతు వేదిక లో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా జడ్జి టి. మాధవి కార్యదర్శ, కమ్ సీనియర్ సివిల్ జడ్జి జిల్లా న్యాయ అధికార సంస్థ ములుగు పాల్గొని మాట్లాడుతూ హెచ్ఐవి సోకిన వ్యక్తులు వివక్షతకు గురికాకుండా ఆత్మస్థైర్యంతో మంచి జీవితం గడపాలని తెలియజేశారు. అలాగే న్యాయ సేవాధిక సంస్థ సివిల్ సప్లయస్ డిపార్ట్మెంట్ వారి సహాయం తో హై రిస్క్ గ్రూప్స్ కు ప్రతి నెల 10 కేజీల రైస్ ఇవ్వడం జరుగుతుంది అలాగే అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం డిసెంబర్ 3న జరుపుకుంటున్నాము. దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జె. సౌఖ్య అదనపు జూనియర్ సివిల్ జడ్జి ములుగు, డాక్టర్ విపిన్ డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ, ములుగు, డాక్టర్ చంద్రకాంత్ పోరిక, మెడికల్ ఆఫీసర్ ప్రైమరీ హెల్త్ సెంటర్ గోవిందరావుపేట, డాక్టర్ బి. పవన్ కుమార్, బి. తిరుపతయ్య, మేకల మహేందర్ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్సె కౌన్సిల్, బానోత్ స్వామి దాస్ డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్సె కౌన్సిల్, అడ్వకేట్ డి. సుధాకర్, డి. సంజీవ లీగల్ ఆఫీసర్ ఆశ వర్కర్లు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు