– వ్యక్తిపూజ చేసే వారికే పదవులిస్తున్నారని సీనియర్ల మండిపాటు ొ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ముట్టడించిన బీజేపీ నాయకులు
నవతెలంగాణ-నిజామాబాద్ సిటీ
బీజేపీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఎంపీ అరవింద్, పార్టీ జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మినర్సయ్య ఒంటెద్దుపోకడలకు పాల్పడుతూ.. పార్టీ కోసం పని చేసే వారికంటే.. వ్యక్తిగత పూజ చేసే నాయకులకే పదవులు కట్టబెడుతున్నారని బీజేపీ సీనియర్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, బోధన్, బాల్కొండ నియోజకవర్గాలకు చెందిన బీజేపీ నాయకులు జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయాన్ని సోమవారం ముట్టడించారు.