నవతెలంగాణ-శంషాబాద్
తల్లీకూతుర్లు అదృశ్యమైన ఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మం గళవారం జరిగింది. స్టేషన్ హౌస్ ఆఫీసర్ నరేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం శంషాబాద్ మండల పరిధిలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన సుశీల, ప్రభు భార్యా భర్తలు. మూడు రోజుల నుంచి తన భర్త ప్రభు విపరీతంగా కొట్టి మానసికంగా శారీరకంగా వేధిస్తున్నాడని ఈనెల 8వ తేదీన రాత్రి 8 గంటలకు తండ్రి పర్ధం రాములకు సుశీల తెలిపింది. తాను వేధింపులు భరించలేక తన కూతురు శ్రీ వాణిని వెంట తీసుకొని ఇంటి నుంచి వెళ్ళిపోతున్నానని తన తండ్రితో చెప్పిం ది. అనంతరం తన కూతురితో కలిసి ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె తి రిగి రాలేదు. దీంతో కంగారు పడిన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల, బంధు వుల వద్ద వెతికినప్పటికీ వారిద్దరి జాడ కనిపించలేదు. భార్యాభర్తల గొడవ కారణంగానే ఆమె అదృశ్యమైనట్టు పోలీసులకు ఆమె తండ్రి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.