నవతెలంగాణ-పెద్దవంగర
మండల పరిధిలోని చిన్నవంగర గ్రామానికి చెంది న పబ్బతి సోమయ్య (38) అనే వ్యక్తి అదృశ్యమైనట్లు ఎస్సై రాజు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకా రం సోమయ్య తన భార్య, పిల్లలతో కలిసి గ్రామంలో కూలీనాలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 30న కూలీ పనులకు వెళ్లిన అతను తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు అ ప్పటి నుంచి బంధువులు, తెలిసిన వారి వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో అతని భార్య స్వాతి బుధవారం ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 8712656978 సెల్ నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.