నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రెండవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి అదృష్టమైనట్లు రెండవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ యాసిర్ అరాఫత్ శుక్రవారం తెలిపారు. రెండవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ యాసిర్ అరాఫత్ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని దారు గల్లికి చెందిన షేక్ మెహబూబ్(35), మతిస్థిమితం లేక ఈ నెల 16 రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఫోటోలో ఉన్న వ్యక్తి ఎక్కడైనా కనిపిస్తే రెండవ పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని రెండవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ కోరారు.