
మండలంలోని జానకంపేట గ్రామానికి చెందిన జయపాల్ హన్మంతరావు అనే వ్యక్తి భార్యతో గొడవపడి అదృశ్యం అయినట్టు వేల్పూర్ ఎస్సై శనివారం తెలిపారు. మహారాష్ట్ర కి చెందిన ఇతను నెల రోజుల క్రితం భార్య ఆశ రాణి తో పాటు జానకంపెట్ గ్రామానికి వచ్చి కూలి పని చేసుకొని జీవిస్తున్నారు. శుక్రవారం రాత్రి కి ఇంట్లో భార్య తో గొడవ పడి ఇంట్లో చెప్పకుండా ఎక్కడికో వెళ్లి పోయాడు. ఎక్కడ కూడా అతని ఆచూకీ లభించలేదు అతని భార్య ఆశా రాణి పిర్యాదు మేరకు కేసు నమోదు చేయబడింది. ఇతను ఇంట్లో నుండి వెళ్లి పోయినప్పుడు ఎర్ర రంగు చొక్కా మరియు జీన్స్ పాంట్ ధరించి ఉన్నాడు ఇతను ఎవరికైనా కనిపిస్తే 8712659862 నంబర్కు) సమాచారం ఇవ్వాలని తెలిపారు.