వ్యక్తి అదృశ్యం మిస్సింగ్ కేసు నమోదు

నవతెలంగాణ-భిక్కనూర్
వ్యక్తి అదృశ్యమైన సంఘటన భిక్నూర్‌ పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భిక్నూర్‌ పట్టణానికి చెందిన ముదాం నరేష్ గత 25 రోజుల క్రితం ఇంటి నుండి బయటకు వెళ్లి వస్తానని చెప్పి ఇంటికి తిరిగి రాలేదు. గతంలో కూడా ఇంటి నుండి బయటకు వెళ్లి 15 రోజుల తర్వాత ఇంటికి వచ్చాడు. అదేవిధంగా మళ్లీ వస్తాడని కుటుంబీకులు 25 రోజులు ఎదురు చూస్తారు. చుట్టుపక్కల, కుటుంబీకుల వద్ద ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆనంద్ గౌడ్ తెలిపారు.