విధులు బహిష్కరించిన న్యాయవాదులు..

Lawyers suspended from duty– న్యాయవాదులపై దాడులు సరికాదు
నవతెలంగాణ – నసురుల్లాబాద్ 
నిజామాబాద్ జిల్లా బార్ అసోసియేషన్ న్యాయవాది మహమ్మద్ ఖాసింపైన జరిగిన దాడికి నిరసనగా బాన్సువాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం విధులను బహిష్కరించి కోర్టు ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బన్సువాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ మూర్తి మాట్లాడుతూ న్యాయవాదులపై భౌతిక దాడి చేయడం సరికాదన్నారు. న్యాయవాదిపై భౌతిక దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో న్యాయవాద ప్రత్యేక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. న్యాయవాదులపై భౌతికదాడులను ఎదుర్కోవడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం నూతన చట్టం తయారు చెయ్యాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణమూర్తి, న్యాయవాదులు, రమాకాంత్ రావు, లక్ష్మారెడ్డి, మోహన్ రెడ్డి, రామ్ రెడ్డి, ఖలీల్, హైమధ్,మొగులయ్య, అయ్యాల ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.