ఆర్థిక సాయం పంపిణీ

Disbursement of financial aidనవతెలంగాణ – మోర్తాడ్

మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు అనే విషయం తెలుసుకున్న నియోజకవర్గ ఇన్చార్జి సునీల్ రెడ్డి వైద్య ఖర్చుల నిమిత్తం ఐదువేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ చెందిన సీనియర్ నేత కమ్మరి మల్లేష్ అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నాడు అనే విషయం తెలుసుకొని అతనికి వైద్య పరీక్ష నిమిత్తం ఐదువేల రూపాయలను అందివ్వగా డబ్బులను కాంగ్రెస్ పార్టీ నాయకులు బాధితుడికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కుంట శ్రీనివాస్, అశోక్, సురేష్, కృష్ణ గౌడ్, సాయి, అనిల్ తదితరులు పాల్గొన్నారు.