ఆస్పత్రి నుంచి కొలంబియా చిన్నారుల డిశ్చార్జి

బొగోటా : విమాన ప్రమాదం బారిన పడి అమెజాన్‌ అడవుల్లో సుమారు ఐదు వారాలు ఒంటరిగా గడిపిన నలుగురు కొలంబియా చిన్నారులు ఇటీవలే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అమెజాన్‌ అడవుల నుంచి వీరిని రక్షించిన తరువాత బొగోటా మిలటరీ ఆసుపత్రులో చికిత్స అందించారు. 34 రోజుల పాటు ఆస్పత్రిలో ఉన్న తరువాత వీరిని ఈ నెల 14న డిశ్చార్జ్జి చేశారు. మే 1 జరిగిన విమాన ప్రమాదంలో చిన్నారులు తమ తల్లిని, ఇద్దరు ఇతర పెద్దవాళ్లను కోల్పోయారు. 40 రోజుల పాటు వీరు ఒంటరిగా గడపడం ప్రపంచ వ్యాప్తంగా పతాక శీర్షికలకెక్కింది. వీరిలో పెద్ద అమ్మాయి (లెస్లీ, 13 ఏండ్లు) ధైర్యంగా ఉండటం, అమెకు అడవులపై మంచి అవగాహన ఉండటం ఇందుకు కారణంగా అధికారులు చెబుతున్నారు.