– బీఆర్ఎస్ ఎస్సీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి శంకర్ డిమాండ్
– మంత్రి హరీశ్ రావు పై మైనంపల్లి వాఖ్యల ఖండన
నవతెలంగాణ-బెజ్జంకి
మెదక్ అభివృద్ధిని అడ్డుకుంటున్నాడని మైనంపల్లి హన్మంత రావు చేసిన వాఖ్యలపై బీఆర్ఎస్ అధిష్టానం క్రమశిక్షణ రహిత్య చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ ఎస్సీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి జంగిటి శంకర్ డిమాండ్ చేశారు.మంత్రి హరీశ్ రావుపై మైనంపల్లి చేసిన వాఖ్యలను శంకర్ బుధవారం ఖండించారు.మైనంపల్లి చేసిన అనుచిత వ్యాఖ్యలు రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు చూపిస్తాయని త్వరితగతిన క్రమశిక్షణ రహిత్య చర్యలు చేపట్టాలని అధిష్టానాన్ని విజ్ఞప్తి చేశారు.