క్రీడలతో క్రమశిక్షణ మానసిక ఉల్లాసం..

– తొర్రూరు డిఎస్పీ వెంకటేశ్వర బాబు
– మండలంలో నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం
నవతెలంగాణ – పెద్దవంగర
క్రీడలు క్రమశిక్షణ, మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదం చేస్తాయని తొర్రూరు డిఎస్పీ వెంకటేశ్వర బాబు, టీపీసీసీ మాజీ సభ్యులు కేతిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మంగళవారం పెద్దవంగర యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి వాలీబాల్, కబడ్డీ, క్రికెట్ పోటీలను మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆయన తొర్రూరు సీఐ సత్యనారాయణ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యతో పాటుగా, క్రీడల్లో రాణించాలన్నారు. యువజన సంఘాల నాయకులు గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించాలన్నారు. క్రీడల ద్వారా క్రమశిక్షణ అలవాటుపడుతుందని, ఉన్నత విద్యలో రిజర్వేషన్లు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా క్రీడా నిర్వాహకులను, దాతలను అభినందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు రంగు మురళి, ప్రధాన కార్యదర్శి పొడిశెట్టి సైదులు గౌడ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బీసు హరికృష్ణ గౌడ్, సీనియర్ నాయకులు తోటకూరి శ్రీనివాస్, దుంపల కుమారస్వామి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అనపురం శ్రీనివాస్ గౌడ్, దాసరి శ్రీనివాస్, సీతారాం, బండారి వెంకన్న, దంతాలపల్లి రవి, అనపురం వినోద్, గద్దల ఉప్పలయ్య, చిలుక సంపత్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.