దివ్యాంగులకు రాయితీ బస్ పాస్ లు అందజేత..

నవతెలంగాణ-సారంగాపూర్ : మండలం లోని జామ్ గ్రామములో గురువారం నిర్మల్ ఆర్టీసీ ఆధ్వర్యంలో  అర్హులైన 40 మంది దివ్యాంగులకు  50% రాయితీ గల బస్ పాసులను అందచేశారు.ఈ కార్యక్రమంలో విలేజ్ బస్ ఆపీసర్ టి. వి.రమణ, నిర్మల్ బస్టాండ్ స్టేషన్ మేనేజర్ ఏ.ఆర్.రెడ్డి,జామ్ గ్రామస్థులు దిలీప్, రవి, దివ్యాంగులు పాల్గొన్నారు.