ఈ రోజే ఆవిష్కరణ

Discover todayఎన్టీఆర్‌ స్టేడియంలో జరుగుతున్న హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌లో ఈరోజు డా.సంధ్య విప్లవ్‌ రచించిన మరో పుస్తకం వెలువడనుంది. తాను జీవించిన కాలంలో ఒక నూతన ఒరవడిని సృష్టిస్తూ ప్రగతిశీల భారత దేశ ప్రగతిలో తనదైన ప్రత్యేక పాత్ర పోషించిన తన కన్నతల్లి జీవిత చరిత్ర ‘అరుణిమ’ ఆవిష్కరణ జరగబోతోంది. అలాగే ఆమె ‘త్రికాల’ నవల సాహిత్య విమర్శ కార్యక్రమం కూడా నిర్వహించబడుతోంది. అరుణిమ, త్రికాల.. వందల ఏండ్ల సామాజిక అణచివేల చరిత్రకి భిన్నంగా భారత దేశ మహిళలు తమ చరిత్రని తామే ఎలా పున:నిర్మించుకున్నారో తెలిపే నవలలు. నేటి యువతరం తెలుసుకోవలసిన అనేక అంశాలు ఈ రెండు నవలల్లో మనం చూడొచ్చు.