24న కబోది చేపల కబుర్లు ఆవిష్కరణ

తెలుగు వెంకటేష్‌ నాలుగో కవితాసంపుటి కబోది చేపల కబుర్లు ఆవిష్కరణ సభ ఈ నెల 24 ఆదివారం సా.6 గంటలకు హైదరాబాద్‌లోని బాగ్‌ లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలోని షోయబ్‌ హాల్‌లో నిర్వహించనున్నారు. కవి సంగమం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమా నికి కె.శివారెడ్డి, ప్రసాదమూర్తి, సత్య శ్రీనివాస్‌, కవియాకూబ్‌, మెర్సీ మార్గరెట్‌ హాజరు కానున్నారు.