టీఎస్ యుటిఎఫ్ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ..

TS UTF Diary, Calendar Invention..నవతెలంగాణ -తాడ్వాయి 
మండలంలోని కాటాపూర్ లో కాంప్లెక్స్ హెచ్ఎం బాణాల సుధాకర్ చేతుల మీదుగా టీఎస్ యుటిఎఫ్ క్యాలెండర్-2025, డైరీ ని లాంఛనంగా టీఎస్ యుటిఎఫ్ మండల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఆవిష్కరించారు. సందర్భంగా టీఎస్ యుటిఎఫ్ మండలాధ్యక్షులు సుతారి పాపారావు, ప్రధానోపాధ్యాయులు బాణాలు సుధాకర్ లు మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు మండలాధికారులకు, విద్యార్థి విద్యార్థులకు మండల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సర సందర్భంగా ఉపాధ్యాయ ఉద్యోగులకు రావలసిన డి ఏ లను ప్రకటించాలని పి ఆర్ సి నివేదికను వెంటనే సమర్పించాలని, పిఆర్సి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఎండి అక్బర్ పాషా, జీవన్ లాల్, కోడూరు సమ్మయ్య, పబ్బు వెంకటేశ్వర్లు, గోరుట్ల రాజేష్, జయపాల్ యుటిఎఫ్ నాయకులు యాప హనుమంతు తదితరులు పాల్గొన్నారు.