వివక్షాపూరితం

– నిబంధనలపై అధ్యయనం చేస్తున్నాం
– సిఎఎ అమెరికా, ఐరాస ఆందోళన
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)పై అంతర్జాతీయ సమాజం నుంచీ ఆందోళన వ్యక్తమవుతునది. సిఎఎ అమలు నిబంధనల నోటిఫికేషన్‌పై అమెరికా, ఐక్యరాజ్యసమితి(యూఎన్‌) ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ విషయాన్ని ‘రాయిటర్స్‌’ నివేదించింది. ” పౌరసత్వ సవరణ చట్టం ప్రాథమికంగా వివక్షాపూరితమైనది. భారతదేశ అంతర్జాతీయ మానవ హక్కుల బాధ్యతలను ఉల్లంఘించేది” అని యూఎన్‌ ఆందోళన చెందుతున్నదని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్‌ కార్యాలయం ప్రతినిధి వివరించారు. నిబంధనలు అంతర్జాతీయ మానవ హక్కుల చట్టానికి లోబడి ఉన్నాయా లేదా అనే విషయాన్ని అధ్యయనం చేస్తున్నామని పేర్కొన్నారు. యునైటెడ్‌ స్టేట్స్‌ స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ కూడా నిబంధనల నోటిఫికేషన్‌ గురించి ఆందోళన చెందుతున్నట్టు వివరించింది. ఈ చట్టం ఎలా అమలు చేయబడుతుందో పర్యవేక్షిస్తున్నట్టు పేర్కొన్నది. మత స్వేచ్ఛను గౌరవించటం, అన్ని వర్గాలను సమానంగా చూడటం ప్రాథమిక ప్రజాస్వామ్య సూత్రాలు అని రాష్ట్ర శాఖ ప్రతినిధి వివరించారు.