తప్పులను తప్పించుకునేందుకుకే కేఆర్‌ఎంబీపై చర్చ

– బీజేపీ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో
కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు గతంలో చేసిన తప్పులను కప్పి పుచ్చుకునేందుకే అసెంబ్లీలో కేఆర్‌ఎంబీపై చర్చ చేస్తున్నాయని బీజేపీ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ అన్నారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద బీజేపీ ఎమ్మెల్యే కె.వెంకటరమణరెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో లబ్ది కోసమే ఈ చర్చ అని విమర్శించారు. గతంలో కృష్ణా జలాల కోసం రూ.200 కోట్లు ఎందుకు కేటాయించారో తెలియదని, కేఆర్‌ఎంబీకి అప్పగిస్తారనే కారణం కావచ్చునని అన్నారు. ఏ సర్వే చూసినా బీజేపీకి మెజార్టీ అవకాశముందని కాబట్టి కేంద్రంపై నింద వేస్తున్నాయన్నారు. మరోసారి తెలంగాణ ప్రజలను నమ్మించాలని కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ యత్నిస్తున్నాయన్నారు.